ప్రారంభం
కలలు తెగిపడిన చప్పుడు
వెడుతూ వెడుతూ వీడ్కోలు లేఖ గుమ్మంలో పెట్టినట్లు
ఎప్పటిదో తెలీదు
రెండు హృదయాల మధ్య శూన్యం
స్పర్శ కూడా పట్టివ్వలేదు శూన్యప్రారంభాన్ని
దుఖ్ఖంలోంచి శూన్యంలోకి ప్రవహించి
ఇప్పుడు కానరాని మౌనమొక్కటే మిగిలింది
మౌనం భాష కాకుంటే బాగుణ్ణు
కాస్త తలదాచుకోడానికి చోటైనా దక్కేది
ప్రశ్నై నిలిచేకొద్దీ లోపల్లోపలే సంకెళ్ళలో
బందీగా మారిపోవడం
ఆగి ఆగి జ్ఞాపకాలను మోసుకొచ్చే పూల పరిమళం
అదృశ్యమైనట్లుగా
కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి
ఆనవాలు దొరకని సాక్ష్యం
దేహంలోంచి దేహంలోకి తొంగిచూడడం
అంత సులువేమీకాదు
ఇప్పుడు ప్రారంభాన్ని వెతకాలి
నిజమైన నమ్మకాన్ని పున:ప్రసారం చేయాలి
నమ్మకాల్ని దాచి అవిశ్వాసపు ఒరలలో
ఒట్టిపోయిన శూన్య గోళాల్ని గమనించాలి
విశాల తీరాల ఒంటరితనంలోకి
ఒక యుగళాగీతాన్ని ధ్వనింపచేయాలి
--- మల్లవరపు ప్రభాకరరావు(2003)
వెడుతూ వెడుతూ వీడ్కోలు లేఖ గుమ్మంలో పెట్టినట్లు
ఎప్పటిదో తెలీదు
రెండు హృదయాల మధ్య శూన్యం
స్పర్శ కూడా పట్టివ్వలేదు శూన్యప్రారంభాన్ని
దుఖ్ఖంలోంచి శూన్యంలోకి ప్రవహించి
ఇప్పుడు కానరాని మౌనమొక్కటే మిగిలింది
మౌనం భాష కాకుంటే బాగుణ్ణు
కాస్త తలదాచుకోడానికి చోటైనా దక్కేది
ప్రశ్నై నిలిచేకొద్దీ లోపల్లోపలే సంకెళ్ళలో
బందీగా మారిపోవడం
ఆగి ఆగి జ్ఞాపకాలను మోసుకొచ్చే పూల పరిమళం
అదృశ్యమైనట్లుగా
కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి
ఆనవాలు దొరకని సాక్ష్యం
దేహంలోంచి దేహంలోకి తొంగిచూడడం
అంత సులువేమీకాదు
ఇప్పుడు ప్రారంభాన్ని వెతకాలి
నిజమైన నమ్మకాన్ని పున:ప్రసారం చేయాలి
నమ్మకాల్ని దాచి అవిశ్వాసపు ఒరలలో
ఒట్టిపోయిన శూన్య గోళాల్ని గమనించాలి
విశాల తీరాల ఒంటరితనంలోకి
ఒక యుగళాగీతాన్ని ధ్వనింపచేయాలి
--- మల్లవరపు ప్రభాకరరావు(2003)
Comments