ఒకే క్షణం!

ఒకే క్షణం!
నా వ్యధాభరిత గీతాల కలకలం
అంతే! ఎక్కడనుంచో వో గొంతు తెగిన కోయిల ఆర్తనాదం
తెగిన వీణ తంత్రిలా బొంగురుగా వినిపిస్తుంది
పశ్చిమానకు మారిన సూర్యరశ్మితో పాటు

అంతే!
ఇక్కడ కలం కాయితాలతో
మాటల గారడీ ప్రారంభమవుతుంది
ఉషస్సుకై
ఎదురు చూస్తూ
--- మల్లవరపు ప్రభాకరరావు
(1990)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక