వర్షం

చినుకు చినుకు
చిరకాల మిత్రుని పిలుపులా చెవిని సోకి
చిరుజల్లై నా హృదయ మైదానంలో వర్షించె

చినుకు చినుకు
ప్రియురాలి సుదీర్ఘ వియోగానంతర సమాగమంలా
మదిన వసంతమై కోకిల గీతాలు పాడె

చినుకు చినుకు
ముక్కుపచ్చలారని బాల్యపు చివరి కేక
కార్ఖానాల మసిబారిన గోడలలో కలిసినట్లు
మనస్సు నిండా విషాదపు చీకట్లు క్రమ్మె

--- మల్లవరపు ప్రభాకరరావు(1996)

Comments

Popular posts from this blog

పరిమళించే 'జాతీ'యత !

అజాత శత్రువు

దళితుల విజయగాధలు 'దళిత్ డైరీస్'