నేను
నేను ప్రేమిస్తున్నపుడు
ఎన్ని తపించే హృదయాలలో దాగాను
విరహాల్ని, మోహాల్ని
సుగంధాలుగా మార్చే
సుందర దృశ్యాల్ని వీక్షించాను
నేను దు:ఖిస్తున్నప్పుడు
ఎంతమంది హృదయాలలో చలించాను
వొక్క క్షణంలో
ఎన్ని నిట్టూర్పుల హోరు విన్నాను
నేను ద్వేషిస్తున్నప్పుడు
ఎన్ని మండే గుందెల మీదుగా ఉరికాను
ఎన్ని పర్వతాలనుంచో వెల్వడే
విస్ఫోటనాల ప్రకంపనలు కన్నాను
--- మల్లవరపు ప్రభాకరరావు(1996)
ఎన్ని తపించే హృదయాలలో దాగాను
విరహాల్ని, మోహాల్ని
సుగంధాలుగా మార్చే
సుందర దృశ్యాల్ని వీక్షించాను
నేను దు:ఖిస్తున్నప్పుడు
ఎంతమంది హృదయాలలో చలించాను
వొక్క క్షణంలో
ఎన్ని నిట్టూర్పుల హోరు విన్నాను
నేను ద్వేషిస్తున్నప్పుడు
ఎన్ని మండే గుందెల మీదుగా ఉరికాను
ఎన్ని పర్వతాలనుంచో వెల్వడే
విస్ఫోటనాల ప్రకంపనలు కన్నాను
--- మల్లవరపు ప్రభాకరరావు(1996)
Comments