స్వప్న సంగీతం
ఆకాశంపై మేఘాలు
అలా… అలా అలలులా తుళ్ళుతూ
తేలుతూ వెళ్తున్నాయి – నావైపు జాలిగా చూస్తూ
చల్లని పిల్ల తుమ్మెర స్పృసిస్తూపోతుంది
నా బాహువులను జోలపాడినట్లు
చింతాక్రాంతుడ్ని ఓదార్చినట్లు..
నిశ్చల వాతావరణంలో
నింగిపైని చుక్కలు,నా ప్రక్కన పిల్లతుమ్మెరల లాస్యం
దూరాన చెట్లు గుసగుసలాడుకొంటున్నట్లు
కదులుతూ మెరుస్తున్నాయి వెండిలా వెన్నెలతో కూడి
రాత్రి గడిచేలాలేదు-స్వాప్నిక జగత్తు నుండి బయలువడి.
మాటిమాటికీ మంచు తుంపరులొక్కక్కటే
తడిపేస్తున్నాయి నా శరీరమంతా
పొగమంచుకూడా
ఆభరణమల్లే ప్రకృతికాంతకు నాకంటికి-
ఎక్కడో అరుపులు
విన్నట్లే గుర్తు ఎన్నో రాత్రులు వొంటరిగా
మన్నుమిన్నుల మధ్య నాకేమో,
గుడ్లగూబల అరుపులు కూడా సంగీతస్వరమై
నిశ్శబ్దాన్ని చీలుస్తాయి
అప్పుడప్పుడూ నా నిట్టూర్పులకు తోడుగా…
ఏమైనా రాత్రి గడిచేలాలేదు
స్వాప్నిక జగత్తునుండి విడివడి
--- మల్లవరపు ప్రభాకరరావు
(1990)
అలా… అలా అలలులా తుళ్ళుతూ
తేలుతూ వెళ్తున్నాయి – నావైపు జాలిగా చూస్తూ
చల్లని పిల్ల తుమ్మెర స్పృసిస్తూపోతుంది
నా బాహువులను జోలపాడినట్లు
చింతాక్రాంతుడ్ని ఓదార్చినట్లు..
నిశ్చల వాతావరణంలో
నింగిపైని చుక్కలు,నా ప్రక్కన పిల్లతుమ్మెరల లాస్యం
దూరాన చెట్లు గుసగుసలాడుకొంటున్నట్లు
కదులుతూ మెరుస్తున్నాయి వెండిలా వెన్నెలతో కూడి
రాత్రి గడిచేలాలేదు-స్వాప్నిక జగత్తు నుండి బయలువడి.
మాటిమాటికీ మంచు తుంపరులొక్కక్కటే
తడిపేస్తున్నాయి నా శరీరమంతా
పొగమంచుకూడా
ఆభరణమల్లే ప్రకృతికాంతకు నాకంటికి-
ఎక్కడో అరుపులు
విన్నట్లే గుర్తు ఎన్నో రాత్రులు వొంటరిగా
మన్నుమిన్నుల మధ్య నాకేమో,
గుడ్లగూబల అరుపులు కూడా సంగీతస్వరమై
నిశ్శబ్దాన్ని చీలుస్తాయి
అప్పుడప్పుడూ నా నిట్టూర్పులకు తోడుగా…
ఏమైనా రాత్రి గడిచేలాలేదు
స్వాప్నిక జగత్తునుండి విడివడి
--- మల్లవరపు ప్రభాకరరావు
(1990)
Comments