ఇంగిలీసమ్మ
ఇంగిలీసమ్మ
అక్షరాలు
విదిలించని తల్లి
నాకు
చదువుల తల్లిని అని ప్రకటించుకోడమే ఒక కుట్ర
నాకు
అక్షరం ‘అంటు’ అని నిర్దేశించిన సూత్రాలే
ఇప్పటి
నా భాషా మూలాలు అని బొంకడమే ఒక కుట్ర
నాది
కాని భాషని నాదని ప్రకటించబూనడమే ఒక సవర్ణ కుట్ర
అక్షరాన్ని
ఆబగా అందుకోవాలన్నప్పుడు
మా
నాలుకలు కత్తిరించడానికి
మా
చెవుల్లో వేడి వేడి సీసాన్ని పోయడానికి
మూతికి
ముంత ముడ్డికి తాటాకు కట్టుకోడానికి మాత్రమే
ఈ
అక్షరం అన్న విషయం అర్ధం చేసుకోడానికి యుగాలు పట్టింది
అసలు
ఈ అక్షరం నన్నెప్పుడంటుకుంది తల్లీ...
నీ ఒడిలో
నేనెప్పుడూ లేననే నిజాన్ని
గ్రహించడానికే
ఇన్ని సంవత్సరాలు పట్టింది
ఇదిగో
ఈ ఏభై ఆరు అక్షరాలు
ఏ
సప్త సింధు కవతల పలికే అక్షరాల్లోనో కలిసిపోయి
నన్ను
అసింట పెట్టినప్పుడు
పడమటి
దిక్కున పొడిచిన సూర్యుడు
ఓ
నాలుగో, ఇరవై ఆరో అక్షరాలు
నా
నేలను విత్తినప్పుడు కదా
నేనీ
అక్షరాలమ్మ మధ్య కనీసం సవితి బిడ్డనైంది
అయినా
నాది కాని భాషని మోస్తూ
ఇన్ని
గింజల్ని కూడా పొందలేక పోతున్న వాడిని
ఖండాల
కావల భవ్య భద్ర జగత్తు సంగతి
మీరనే
అక్షరాలమ్మ అంపకాలలో జరిగితే జరగనీ
ఇప్పుడు
మీ అమ్మ ఆలనా పాలనా మీరే చూసుకోండి
మా
నోట్లో నాలుకని కత్తిరించని ఒక అమ్మ కనిపిస్తోంది
నాలుగు
గింజలు దొరికే దారేదో చెప్తుంది
ఇంగ్లీషమ్మ
స్తన్యమేదో మాలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి
మల్లవరపు ప్రభాకరరావు
Comments