Posts

Showing posts from September, 2020

జిబ్రాన్ తాత్త్విక సంవేదన బెందాళం కవితానువాదం “ప్రవక్త”

Image
    బెందాళం కృష్ణారావు గారు ప్రముఖ పాత్రికేయులు. అనేక పత్రికలలో పనిచేసారు. చాలా పత్రికలకు ఫీచర్స్ రాస్తుంటారు. పాత్రికేయ వృత్తికి సంబంధించి మీరే జర్నలిస్ట్ లాంటి పుస్తకాలు రాసారు. అలానే అనేక స్వతంత్ర అనువాద సాహిత్య రచనలు చేసారు. బుద్ధుని బోధనలకి సంబంధించి దమ్మ పధం, రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి, ఖలీల్ జిబ్రాన్ ప్రాఫేట్ ని అనువదించి   తెలుగు వారికి అందించారు. ఖలీల్ జిబ్రాన్ ప్రపంచ సాహిత్య చరిత్రలో గొప్ప కవిగా, రచయత, చిత్రకారుడు, తత్త్వవేత్త గా పేరొందిన వ్యక్తి. అయితే ఆటను తనని తత్త్వవేత్తగా పిలవడాన్ని తిరస్కరించాడు. చాలాకాలం క్రితం తెలుగులో జిబ్రాన్ ప్రాఫెట్ నుంచి కొన్ని భాగాలను జిబ్రాన్ సూక్తులు అనే పేరుతో బాలబంధు బి.వి.నరసింహారావు గారు అనువదించారు. కాళోజి జీవన గీత పేరుతో, ఇటీవల మరికొందరు కూడా జిబ్రాన్ ప్రాఫెట్ ని అనువదించారు. ప్రాఫెట్ అంటే ప్రవక్త అని నిఘంటువు అర్ధం. మనకి ఈ పదంతో పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, పశ్చిమాసియా   ప్రాంత వ్యక్తిగా ఆ పదం ప్రాముఖ్యత ఖలీల్ జిబ్రాన్ కి బాగా తెలుసు. క్రీస్తుకి పూర్వం ఇస్రాయిల్ జాతి చర...

కొండల నడుమ “గుప్పెడు సూర్యుడు మరి కొన్ని కవితలు”

Image
ఈ సంవత్సరం ఉత్తమ తెలుగు అనువాదకుడిగా ప్రముఖ కవి , పాత్రికేయులు శ్రీఎ.కృష్ణారావు కి కేంద్రసాహిత్య అకాడమీ ప్రకటించింది. ప్రముఖ డోగ్రీ భాషా కవయిత్రి పద్మా సచ్ దేవ్ కవిత్వం “ A handful of sun and other poems” పేరుతో ఆంగ్లభాష లోకి అనువదించిన డోగ్రీ భాషా కవిత్వాన్ని తెలుగులోకి “గుప్పెడు సూర్యుడు మరి కొన్ని కవితలు” పేరుతో తెలుగులోకి అనువదించినందుకు ఆయనకీ పురస్కారం లభించింది. వారు అనువదించిన పద్మా సచ్ దేవ్ కవిత్వాన్నిఇంతకు ముందెప్పుడో చదివినా ఇప్పుడు అవార్డ్ ప్రకటనతో మరోమారు చదివాను. ముఖ్యంగా అనువాద కవిత్వమైనా ఇదేదో నేరుగా రాసిన కవిత్వం లా అనిపించింది . అనువాద కవిత్వం లా అనిపించకుండా చేయడంలోనే కృష్ణారావు గారి విజయం దాగి ఉంది. పద్మా సచ్ దేవ్ డోగ్రీ భాషలో తొలి కవయిత్రి. జమ్ము కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ లలోని కొన్ని ప్రాంతాలలో  మాట్లాడే డోగ్రీ భాషను 2003 లో రాజ్యాంగం లోని గుర్తింపు పొందిన భాషలలలో చేర్చారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన పహాడీ చిత్రకళ శోభాయమానంగా ఉండి ప్రపంచ గుర్తింపు పొందింది.   మాట్లాడతారు. పద్మా సచ్ దేవ్ తండ్రి ప్రముఖ పండితుడైన పండిత జయదేవ్ ను దేశవిభజన సమ...

బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్

Image
    ప్రముఖ నాటక రచయత పద్మ భూషణ్ గిరీష్ కర్నాడ్ మృతి (జూన్ 10) చెందడంతో భారతదేశం ఒక గొప్ప సాహితీ వేత్తను కోల్పోయినట్లైంది. సాహిత్యం ,  సినీ రంగాలలోను అత్యున్నత ప్రతిభ చూపిన ఆయన ప్రభావం అపారమైనది.   2.    గిరీష్ రఘునాథ్ కర్నాడ్ అప్పటి బాంబే ప్రెసిడెన్సి లోని మాధేరన్ ప్రాంతంలో మే 19 ,  1938 లో జన్మించారు. యువకుడిగా ఉన్నప్పుడు యక్ష గానం పట్ల ,  నాటక రంగం పట్ల  ఆకర్షితుడయ్యారు. 1958 లో కర్ణాటక ఆర్ట్స్ కాలేజీ ,  ధార్వాడ్ నుంచి గణితం ,  సాంఖ్యక శాస్త్రాలలో డిగ్రీ ని పొందాడు. పిమ్మట ఉన్నత విద్యను రోడ్స్ స్కాలర్ షిప్ పొంది ఆక్స్ ఫోర్డ్ నుంచి ఫిలాసఫి ,  రాజనీతి శాస్త్రం ,  ఆర్ధిక శాస్త్ర విభాగాల్లో యెమ్.ఏ పట్టాను పొందాడు. అక్కడే ఆక్స్ ఫోర్డ్ యూనియన్ ప్రెసిడెంట్ గాను ఎన్నికయ్యారు. భారత దేశానికి తిరిగి వచ్చాక మద్రాస్ లోని ఆక్స్ ఫోర్డ్ యునివర్సిటి ప్రెస్ లో చేరారు. ఆ సమయంలోనే డా. సరస్వతీ గణపతి తో పరిచయం ఏర్పడింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత వారు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానము. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా రచన...

కొత్త చూపునిచ్చే రోడ్ జర్నీసినిమా “North 24 Kaatham”

Image
           ప్రయాణం మనకో కొత్త చూపునిస్తుంది. మన లోచూపుని   విస్తరిస్తుంది. మన రోజువారీ జీవితంలో మన ఉద్యోగాలలో , పనులలో ఎక్కడో మనం తప్పిపోయినప్పుడు ఒక ప్రయాణం మనల్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అందుకే రోడ్ మూవీస్ ని కాస్త ఎక్కువగానే చూస్తుంటాను. జీవితాన్ని అవి వ్యాఖ్యానించే పద్ధతి ఒక బైరాగి పదాలలాగా అనిపిస్తాయి. ఇప్పుడు కరోన సంక్షోభం కారణాన ఇంట్లోనే ఉండిపోయిన నాకు బయటివైపు చూడడానికి మలయాళ రోడ్ మూవీ “ నార్త్ 24 కాథమ్ ” (North 24 kaatham అంటే నార్త్ 24 మైల్స్)   సహాయం చేసింది. మలయాళంలో కాథమ్ అనేది దూరాన్ని తెలిపే పదం. ఒక కాథమ్ 16 కిలోమీటర్లకి సమానం. ఈ సినిమాలోని ప్రయాణం మొత్తం కేరళలోని దాదాపు అన్నిప్రదేశాల మీదుగా జరుగుతూ అంతకి మించిన జీవిత వ్యాఖ్యానం అందిస్తుంది.     ఇర్ఫాన్ ఖాన్ మృతి విషాదంలో ఉన్నప్పుడు అనుకోకుండా నాకు ఫహద్ ఫాసిల్ గుర్తొచ్చాడు. దక్షిణాదిలో “ నటించడం ” తెలీని నటుడుగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన “ నార్త్ 24 మైల్స్ ” సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందిన ఒక అర్ధవంతమైన సినిమా. 2013 జ...

పిల్లల భావోద్వేగాల ప్రపంచం “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్”

Image
                                         ప్రపంచ వ్యాప్తంగా అర్ధవంతమైన సినిమా నిర్మాణపరముగా ఇరాన్ సినిమా బాగా గుర్తింపు తెచ్చుకుంది. అనేక అంతర్జాతీయ సినిమా వేడుకల్లో ఇరాన్ సినిమా ఒక చర్చనీయాంశమవుతూ విమర్శకుల ప్రశంసలందుకుంటూ వుంది. ముఖ్యంగా పిల్లల సినిమాకు సంబంధించి ఇరాన్ సినిమా చాలా ఉన్నతమైన ప్రమాణాలు ఏర్పరిచింది. ఇరాన్ చిత్ర పరిశ్రమ పిల్లలకు సంబంధించి తీసిన సినిమాలు పిల్లల సున్నితత్వాన్ని ,   వారి అనుబంధాలను ,   వారి బాల్యాన్ని మనముందు చాలా సరళం గా   ఆవిష్కరిస్తాయి. మజీదీ మజీద్ ఇరాన్ సినిమాకు సంబంధించి గొప్ప దర్శకుడు. 1997 లో అతను రూపొందించిన చిల్డ్రన్ ఆఫ్ హెవెన్( Children of Heaven)  సినిమా 1998 లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో   ఆస్కార్ అవార్డ్ కొరకు పోటీపడిన మొదటి ఇరాన్ సినిమా. ఈ దర్శకుడు తీసిన మరో సినిమా   “ ది సాంగ్ ఆఫ్ స్పారో ”   తో 200 8  అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (విశాఖపట్నం...