' మధురకవి' బిరుదాంకితులు మల్లవరపు జాన్ కవిగారు పద్యం రాసినా, వచనం రాసినా అలవోకగా సాగిపోతుంది. ప్రతి పద్యం ద్రాక్షాపాకంతో రసభరితంగా ఉంటుంది. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉండే నిగూఢమైన భావాల్ని కూడా సరళంగా అర్థమయ్యే శైలీలో వర్ణించ గల ప్రతిభాశాలి జాన్ గారు. అలాంటి కవిగారి కవిత్వాన్ని సమకాలీన దిగ్గజ్జాల్లాంటి కవులు కూడా మెచ్చుకోవటం ఒక ప్రత్యేకత. అయితే, ఆయన గురించి ఒక శతకమే వెలువడటం మరో విశేషం. ప్రముఖ కవి, అవధాని చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డిగారు మల్లవరపు జాన్కవి జీవితం, వ్యక్తిత్వం, రచనలలో కనిపించే తత్త్వం ఇలా అన్నింటినీ రసభరితంగా వర్ణిస్తూ " మధురకవీంద్రశతకం"ను రాశారు. ఒకటి రెండు పద్యాలు మినహా "కవీంద్ర" అనేదే మకుటం. ఈ మకుటాన్ని ఎన్నుకోవటంలోనే చంద్రశేఖర రెడ్డిగారికి, జాన్కవిగారి పట్ల గల అభిమానం వ్యక్తమవుతుంది. జాన్కవిగారి కుటుంబాన్ని బాగా పరిశీలిస్తేగాని రాయలేని కొని పద్యాలు ఈ శతకంలో కనిపిస్తున్నాయి. " వ్యాసునకు వినాయకునటు వ్రాసెను మధురమున కొడుకు రాజేశ్వరరావ్ వాసిని గాంచగ కృతులన్ శ్యాసయనగ మెల్గి నాడు !జాన్ కవీంద్రా!" జాన్కవిగారి కుటుంబం గురించి త...
Comments