శ్రీ వాణి

పనస తొనలకన్న పాలమీగడకన్న
మధువుకన్న ముగ్ధ వధువుకన్న
మల్లవరపు కవిత మధురాతి మధురమ్ము
"జాను" తెనుగు మేలి "జాను తెనుగు"


భావమునకు తగిన పదములన్నియు వచ్చి
అందమైన ఛందమందు నొదిగి
పరమ హృద్యమైన పద్యమ్ముగా మారు
"జాను" తెనుగు మేలి "జాను తెనుగు"


మలయ మారుతములు పలుకరించిన యట్లు
ప్రేమ సుధలు చిలుకరించినట్లు
పుడమితల్లి గుండె పులకరించినయట్లు
"జాను" తెనుగు మేలి "జాను తెనుగు"

-"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి(సెప్టెంబరు 1981)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక