అక్షరాభిషేకం

కూచున్న చోట కదలక
బాచాపట్లేసుకొన్న పండిత కవిశ్రీ
మా 'చీమకుర్తి జాను 'కు
వాచా మనసా శుభమ్ము భారద్వాజా!

నాన్నదె ఆ తలకట్టు
నాన్నదె ఆకవిత చుట్టు నవ్యతపట్టున్
నాన్నయె 'రాజేశ్వరున 'కు
వన్నెయు వాసియును గూర్చు భారద్వాజా!

శ్రీకర కవితా వాణికి
ఆకరమై ఆత్మీయత అక్షరమయమై
వాకొను 'మల్లారపు ప్ర
భాకరు 'డొక అగ్గిపిడుగు భారద్వాజా!

----- డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు
(2000)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక