తలపు
తేనెలూరు తెల్గుతీరు గనుంగొన(
గోర్కి వొడమువారు;కుంటి నడక
లేని కైత సౌరు గాన వేడుక సేయు
వారు;కనుడు-మల్లవరపు( గృతిని
యతులు ప్రాస లప్రయత్నమ్ముగా వచ్చి
కుదురు కొంట మెచ్చుకొంద్రు బుధులు;
’మల్లవరపు జాను’ బల్లిదు( డీ జగా
నేర్మియందు బాస పేర్మియందు
జాతి నలరించు నుడికార మే తదీయ
కవితకున్ మేలి తొడవు;సంఘమును దిద్దు
చూపుతో నిది పయనించు;సూనృతమ్ము
పలుక వెఱువదు-మఱవదు పడి తెఱ( గు
జానువంటి కవులు జాను( దెనుంగుతో
సంతరింప వలయు సత్కవిత్వ;
మాంధ్రి నిక్కమైన యందముతోడ నూ
రేగవలయు నాట నెల్ల యెడల
-"అభినవ తిక్కన,తెలుగు లెంక"
తుమ్మల సీతారామమూర్తి(సెప్టెంబరు 1981)
గోర్కి వొడమువారు;కుంటి నడక
లేని కైత సౌరు గాన వేడుక సేయు
వారు;కనుడు-మల్లవరపు( గృతిని
యతులు ప్రాస లప్రయత్నమ్ముగా వచ్చి
కుదురు కొంట మెచ్చుకొంద్రు బుధులు;
’మల్లవరపు జాను’ బల్లిదు( డీ జగా
నేర్మియందు బాస పేర్మియందు
జాతి నలరించు నుడికార మే తదీయ
కవితకున్ మేలి తొడవు;సంఘమును దిద్దు
చూపుతో నిది పయనించు;సూనృతమ్ము
పలుక వెఱువదు-మఱవదు పడి తెఱ( గు
జానువంటి కవులు జాను( దెనుంగుతో
సంతరింప వలయు సత్కవిత్వ;
మాంధ్రి నిక్కమైన యందముతోడ నూ
రేగవలయు నాట నెల్ల యెడల
-"అభినవ తిక్కన,తెలుగు లెంక"
తుమ్మల సీతారామమూర్తి(సెప్టెంబరు 1981)
Comments