Posts

Showing posts from April, 2008

సాక్షి

మల్లవరపు జాను మధురసాహిత్యంపు సౌరభమ్ము భువిని చాలనాళ్లు రసమనోజ్ఞలీల ప్రసరించితీరును సహజకవి కలమ్ము సాక్షిగాను --- మల్లెమాల 7/10/04

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక

Image
కవిత్వంలోని వస్తువు, అభివ్యక్తులను బట్టి గుర్తించటమే ప్రతి కవికీ నిజమైన గుర్తింపు. అలాంటప్పుడు కుల, మత, ప్రాంతీయ భేదాలు పొడచూపవు. నిజానికి కవిత్వాన్ని ఇష్ట పడటానికి ఈ కొలమానాలు చాలా మంది చూస్తుంటారు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది భావజాలం. భావజాలం నచ్చినప్పుడు పైవేమీ పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇవేమీ కాకుండా, కేవలం కవిత్వాన్నే ఇష్టపడేవాళ్ళూ ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా అరుదు. అసలు విషయం ఏమిటంటే, ఇటీవల సాహితీకౌముది త్రైమాసిక పత్రిక ఏప్రిల్ 2007 సంచిక చూశాను. దాన్ని మధుర కవి శ్రీ మల్లవరపు జాన్‌ 80 వ జయంతి ప్రత్యేక సంచికగా ప్రచురించారు. తెలుగు పద్య సాహిత్యాన్ని ప్రోత్సాహించే పత్రిక. దీనిలో చాలా మంచి వ్యాసాలు, కవితలు ఉన్నాయి. జాన్‌ కవి గారి గురించే కాకుండా, మరికొన్ని శీర్షికలు కూడా ఉన్నాయి. సాహితీ వార్తలు ఉన్నాయి. వ్యవస్థాపక ప్రధాన సంపాధకులు శిష్ట్లా వెంకట్రావు గారు మంచి సంపాదకీయం రాశారు. సంచికలో ఉన్న అన్ని వ్యాసాల పెట్టు ఆ సంపాదకీయంలో ఉంది. జాన్‌కవిగారి సమగ్ర వ్యక్తిత్వం ఆ సంపాదకీయంలో పెట్ట గలిగారు. సనాతన సంప్రదాయాన్ని మన్నిస్తూనే వాటిలోని బల హీనతలను త్రోసి రాజనగల కవులలో ఒకరుగా జాన్‌ క...

అక్షరాభిషేకం

కూచున్న చోట కదలక బాచాపట్లేసుకొన్న పండిత కవిశ్రీ మా 'చీమకుర్తి జాను 'కు వాచా మనసా శుభమ్ము భారద్వాజా! నాన్నదె ఆ తలకట్టు నాన్నదె ఆకవిత చుట్టు నవ్యతపట్టున్ నాన్నయె ' రాజేశ్వరున 'కు వన్నెయు వాసియును గూర్చు భారద్వాజా! శ్రీకర కవితా వాణికి ఆకరమై ఆత్మీయత అక్షరమయమై వాకొను 'మల్లారపు ప్ర భాకరు 'డొక అగ్గిపిడుగు భారద్వాజా! ----- డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు (2000)

అజాత శత్రువు

Image
"పనస తొనలకన్న పాల మీగడకన్న మధువుకన్న ముగ్ధ వధువు కన్న మల్లవరపు కవిత మధురాతి మధురమ్ము 'జాను ' తెనుగు మేలి జాను తెనుగు" (కరుణశ్రీ) సనాతన సంప్రదాయాన్ని మన్నిస్తూనే వాటిలోని బలహీనతలను త్రోసి రాజనగల జాతీయోద్యమ నవ్య భావకవిత్వోద్యమంలో నుండి అభ్యుదయ వాద కవిత్వోద్యమం ఆవిర్భవించింది.ఈ రెండు ఉద్యమాలే 20వ శతాబ్దపు సాహిత్యరంగాన్ని శాసిస్తున్నాయి.మొదటి దానికున్న ప్రాపంచిక దృక్పధం భావాత్మకమైనది.రెండవ దృక్పధం భౌతిక సాంఘిక, సామాజిక, రాజకీయాత్మక మైనది. ఇటు నవ్య సాంప్రదాయం అటు అభ్యుదయ కవితా దృక్పధం, దళిత, స్త్రీవాద ఉద్యమాలను మేళవించి వారధిగా నిలచిన యుగపురుషుడు నవయుగ కవితా చక్రవర్తి, మహాకవి జాషువా. ఆయన మార్గమును ఎన్నుకొని కవితా ప్రస్థానమును కొనసాగించిన మహోద్ధాత్త వ్యక్తి మధుర కవి జాన్. ఆధునిక భావజాలాన్ని వ్యక్తీకరించడానికి పద్యం వాహిక కాదని ఛందస్సు ఆటంకమని అభ్యుదయ వాదుల ఆరోపణ.శ్రి జాన్ కవి తెలుగు భాష లోని నుడికారపు సొంపు చేతను, ఉపమా,రూపక,అర్ద్థాంతర న్యాసాది అలంకారముల ప్రయొగముతోను, వర్గ సంఘర్షణ, దోపిడి విధానముపై తిరుగుబాటు,ఆర్ధిక వత్యాసాల నిర్మూలన,సమసమాజ...

తలపు

తేనెలూరు తెల్గుతీరు గనుంగొన( గోర్కి వొడమువారు;కుంటి నడక లేని కైత సౌరు గాన వేడుక సేయు వారు;కనుడు-మల్లవరపు( గృతిని యతులు ప్రాస లప్రయత్నమ్ముగా వచ్చి కుదురు కొంట మెచ్చుకొంద్రు బుధులు; ’మల్లవరపు జాను’ బల్లిదు( డీ జగా నేర్మియందు బాస పేర్మియందు జాతి నలరించు నుడికార మే తదీయ కవితకున్ మేలి తొడవు;సంఘమును దిద్దు చూపుతో నిది పయనించు;సూనృతమ్ము పలుక వెఱువదు-మఱవదు పడి తెఱ( గు జానువంటి కవులు జాను( దెనుంగుతో సంతరింప వలయు సత్కవిత్వ; మాంధ్రి నిక్కమైన యందముతోడ నూ రేగవలయు నాట నెల్ల యెడల -"అభినవ తిక్కన,తెలుగు లెంక" తుమ్మల సీతారామమూర్తి (సెప్టెంబరు 1981)

శ్రీ వాణి

పనస తొనలకన్న పాలమీగడకన్న మధువుకన్న ముగ్ధ వధువుకన్న మల్లవరపు కవిత మధురాతి మధురమ్ము "జాను" తెనుగు మేలి "జాను తెనుగు" భావమునకు తగిన పదములన్నియు వచ్చి అందమైన ఛందమందు నొదిగి పరమ హృద్యమైన పద్యమ్ముగా మారు "జాను" తెనుగు మేలి "జాను తెనుగు" మలయ మారుతములు పలుకరించిన యట్లు ప్రేమ సుధలు చిలుకరించినట్లు పుడమితల్లి గుండె పులకరించినయట్లు "జాను" తెనుగు మేలి "జాను తెనుగు" -"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి (సెప్టెంబరు 1981)

మధ్యాహ్న కవిభానూ! మల్లవరపు జానూ!

"పండుటాకు భువినిరాలి పడుచునుండ చిన్న చివురాకు తలయెత్తుచున్న పగిది"(ఇది మీ కవితే) ఎదుగుతున్న మీ పలుకును చూస్తూవుంటే ఇరుగట్టులను ఒరుసుకొని పారే మీ ఝరీ కవితను గమనిస్తూవుంటే- ఎంత ఆనందం కలిగిందో చెప్పనా? ఆత్మీయుడు జాషువా వచ్చి నా గుండెను తడుతున్నాడా అనిపించింది- ఆ కాల్పనిక సత్యానికి నా మనసు పుటలను విశద సాక్షులుగా విప్పనా? -డాక్టర్ సి.నారాయణ రెడ్డి (1981)