పశ్చాత్తాపమెరుగని నేరస్థుడు


అతడు వెడుతూ వెడుతూ
ఒక పాటను తన వెనక పరిచి  పోయాడు
పట తివాచీ మీద మనం నడచి హొయలు పోవడానికి

అతడు వెడుతూ వెడుతూ
ఒక ధిక్కార ప్రకటన చేసి వెళ్ళాడు
ఆ ప్రకటన ప్రకంపనల్లోంచి కొత్త గొంతులు వినిపిస్తున్నాయి

అతడు వెడుతూ వెడుతూ
పువ్వులాంటి అతని హృదయాన్ని చిదిమిపోయాడు
అతని ప్రేమరాహిత్యపు లోగిళ్ళనుంచి
వెలువడే రాగాలలొ ఉక్కిరి బిక్కిరి అవుతున్న
చెలికాళ్ళ సంవేదనలు

అతడు వెడుతూ వెడుతూ
స్వీయ విధ్వంసానికి పాల్పడి
అతనిని ప్రేమించేవారి   శిరస్సులను
అవనతం చేఎసి మరీ వెళ్ళాడు

తన గాయాలు చూళ్ళేని ప్రేమికులు, చెలికాళ్ళు
హింసననుభవిస్తుంటే
ఎటో చూస్తూ, నవ్వుతూ,
సమూహంలోనే యోజనాల దూరంలో ఒంటరిగా నిలబడి
పశ్చాత్తాపమెరుగని నేరస్థుడిలా
తలెత్తుకొనే వెళ్ళిపొయాడు.

                                         ---మల్లవరపు ప్రభాకరరావు

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక