నిత్య నూతనమ్ము నీ కలమ్ము



ఆటవెలది నుదుట నక్షర తిలకమ్ము
దిద్ది యామె నోట ముద్దులొలుకు
కలము సూక్తులెన్నొ కమ్మగా బలికించి
నట్టి 'జానూ సుకవి నభినుతింతు;

నిత్య సత్యములకు నిలువుటద్దాలుగా
లలితమైన నీ కలమ్ము నుండి
జాను తెనుగులోన జాలువారిన సూక్తు
లఖిల జనుల మెప్పులంది తీరు;

ప్రాఙ్ఞులౌర! యనెడు పలుకావ్యములు వ్రాసి
ఖ్యాతి గనిన మడుర కవివి నీవు;
అడుసు మడులలోన నావిర్భవమ్మంది
పరిమళించుచున్న పద్మమీవు;

తెనుగు బాసలోని తీరుతెన్ను లెరింగి
మరినట్టి కలమర్మమెరిగి
మంచి కవితలల్లు "మల్లవరపు జాను" !
నిత్య నూతనమ్ము నీ కలమ్ము

---అభినవ వేమన
డా. మల్లెమాల

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక