మూలుగు

ఈ రూపాలు
రంగులు మార్చుకుంటూ
వంచనా శిల్పానికి
అత్తర్లు అద్దుతున్నాయి
వ్యధాభరిత గాధలన్నీ
గతం తొక్కిన అడుసులై
నిద్రలేని రాత్రుల నేపధ్యంలో
దుఃఖాన్ని కావలించుకోవడమే
****
ఈ దుఃఖాలన్నింటిని కావలించుకుని
ఒక నిశ్శబ్దమైన రాత్రిలో
చీకటి పడకను చేరుకుంటాను
ఏముంది? నిరంతర పయనం తర్వాత
ఒక శిలాజంలా కరిగిపోవటం తప్పించితే
శబ్దాలన్నింటిని అరిగిపోయిన అక్షరాలుగ మార్చి
విసిరేస్తే శవాలపై జల్లిన పూలు మాదిరే

--- మల్లవరపు ప్రభాకరరావు
(1990 )

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక