Posts

Showing posts from March, 2012

నిజం

కంట్లో నలుసు తొలిగిపోదు వాన కురవని నేలల్లో వాగ్దానం నెరవేరని బతుకుల్లో నెర్రెలిచ్చిన నేలకు కన్నీళ్ళ మడులు గంగిరెద్దు కొమ్ములకు గుడ్డముక్కల తళుకులు గురిచూసి విసిరే వల దగాపడిన కాలువల కధలు కంచికిపోయి నీతిబొట్టులేని పాపం ఇంకుడు గుంటలదవుతుంది మోక్షమివ్వని పెద్దోళ్ళ తలపాగాల్లో కుదేలయిన ప్రాణాలు కొనఊపిరితో తొంగిచూస్తున్నాయి బాకీబతుకులకి చలనరహితమైన కాలం దుఃఖోపశమనం అవుతుంది ఊరికి ఉత్తరాన పచ్చనోట్ల కోసం ఎదురుచూస్తున్న పల్లె ఆశను రాబందులు ఎండగడ్తున్నాయి ఫొద్దుపొడిచినా కానరాని సూరీడి అలసత్వానికి నిజం చింతచెట్టు నీడలో కలిసిపోయింది -మల్లవరపు ప్రభాకరరావు (2000)

ఙ్ఞాపకంగా మారిన నవ్వు

నవ్వుతూ ఉండడం అంత తేలికేమీ కాదు నవ్వుతో కోటి దీపాలు వెలిగించడం బ్రతుకులో ఆశలు పూయించడం నిజంగా నవ్వడమంటే మామూలు విషయం కాదు మొహానికి రంగేసుకున్నట్లుండే ముసుగు తగిలించుకున్నట్లుండే తోడేలు మొహానికి మేక ముసుగు తొడుక్కునే ప్లాస్టిక్కు నవ్వుల గురించి కాదు ప్పుడు మాట్లాడడం నవ్వు గురించి మాట్లాడ్డమంటే హృదయశుథ్థిగల వ్యక్తి పెదాలపై అలలుగా కదిలే నవ్వు గురించిన ఙ్ఞాపకం ఇప్పుడు నవ్వు ఙ్ఞాపకంగా మారిన పెదాల మథ్య మూలుగు ఒక్క నవ్వేనా! మాటలు కూడా మననం చేసుకోవాల్సివస్తుందని ఎప్పుడైనా తలచామా... అయినా మాటలంటే అవేమంత సుదీర్ఘ సంభాషణలేమీకాదుగా నీలోకి చూసి నిన్ను తట్టిలేపి నీ భుజంపై చేయివేసి నీ బ్రతుకుకు భరోసా ఇచ్చే మాటలు పెదాలు పలికే మాటల హృదయావిష్కరణ అవును మాటలంటే నమస్తే పాపా, నమస్తే బాబూ నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్కయ్యా నమస్తే అన్నయ్యా, నమస్తే తమ్ముడూ నంస్తే అవ్వా, నంస్తే తాతా... నమస్తే... నమస్తే... మాటల్లోని క్లుప్తత చొచ్చుకుపోయే సుదీర్ఘ రహస్య సంభాషణ కాకపోతే కోట్లమంది రహస్య స్నేహితుడి అదృశ్యం మిగిల్చిన కోట్ల దు:ఖాలు ఈ రోజు బేగంపేటకో, పావురాలగుట్టకో ఇదుపులపాయకో ఎందుకు పయనమవుతాయి ఒక్క మాటేనా - నమ్మకం నింపుక...

సొంత గొంతు

మావికాని నినాదాల హోరులో తడిసినోళ్లం మావికాని వివాదాల సుడులలో విసిరేయబడ్డవాళ్లం మావికాని మాటలకు చప్పట్లై హోరెత్తినవాళ్లం ఇన్నాళ్లూ... మీ పదవుల పందేరంలో పావులైనోళ్లం మీ సంపదల తూణీరంలో చెమట చుక్కలై రాలినోళ్లం మీ అథికార దర్పానికి ఆథారమైనోళ్లం మీ భవంతుల రంగుటద్దాల్లో నీడలైనోళ్లం మీ మేకవన్నె చిఱ్నవ్వుల వెనక నెత్తుటి మరకలైనోళ్లం మీ వెన్నపూస మనస్సు ముసుగు లోపల లాకప్ చావులైనోళ్లం మీ బినామీ భూముల పట్టాలమీద వేలిముద్రలైనోళ్లం ఇక, ఇప్పుడిప్పుడే మా గొంతేదో ఆనవాలు పడుతున్నాం ఏ ఎండకా గొడుగుల నీడలలోంచి బయట పడుతున్నాం జెండా కర్రల మోత బరువులను దించుకుంటున్నాం ఇక, ఇప్పుడిప్పుడే మా నలిగిపోయిన శరీరాలనుంచి కారుతున్న చెమట చుక్కలనుంచి మా విసిరివేయబడ్డ వాడల్లోంచి ఇరుకు గుడిసెల్లోంచి బరువెక్కిన గుండెల్లొంచి మా మాటలను కూర్చుకుంటున్నాం ఇక, ఇప్పుడు చేలగట్లపై వాలిన మొండేల సాక్షిగా కాలువలై పారీన నెత్తురు సాక్షిగా నిలువెత్తు నల్లజెండాను నిలేసి శతాబ్దాల భావదాస్యపు నీడలలోంచి బయట పడుతున్నాం ఆగమై పోయిన మాయమ్మల రోదనతో మా యుథ్థతంత్రాన్ని మేమే రచించుకుంటాం ఇక మా అడుగులను మేమే పరచుకుంటాం ఇక ఇప్పుడు అరువు గొంతుల వాగ్దానాలు తి...