Posts

Showing posts from May, 2008

నిద్ర

కనుల రెప్పల దుప్పట్లు గప్పి వైచి జీవసహిత సమాధి నిష్ఠితుల జేసి తీయ తీయని కలలు విచ్చేయునటుల సాయపడెడి నిద్రాదేవి స్వాగతంబు గ్రంథపఠన వేళ, కమనీయ దృశ్యంబు కనెడు వేళ, కథలు వినెడి వేళ చూడలేక నీవసూయతో నేతెంచి నింద బొందనేల నిదురతల్లి శ్రుతహితంబు గాని శుష్కనంభావన మాచరింప వచ్చినట్టి వాని వాత బడక నిద్ర వచ్చినట్లు నటింప నీవు దిక్కు గావె నిదురదేవి ---- మధురకవి మల్లవరపు జాన్ (అముద్రిత కవిత)